అక్షరటుడే, వెబ్‌డెస్క్: JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ పరీక్ష ఫలితాలను సోమవారం ఉదయం కాన్పూర్ ఐఐటీ(Kanpur IIT) విడుదల చేసింది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష(JEE Advanced Exam) జరిగింది. ఈ లింక్ క్లిక్ చేసి https://results25.jeeadv.ac.in/ విద్యార్థులు రిజల్ట్ చూసుకోవచ్చు.
JEE Advanced Results | దేశంలో 23 ఐఐటీలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 23 ఐఐటీలు ఉన్నాయి. వాటిలో గతేడాది 17,760 సీట్లు భర్తీ చేశారు. అయితే తాజాగా కొన్ని ఐఐటీ(IIT)ల్లో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడంతో ఈ విద్యా సంవత్సరం సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది పరీక్ష రాసినట్లు సమాచారం. కటాఫ్ ఆధారంగా అభ్యర్థులకు కౌన్సెలింగ్(Counseling) నిర్వహించనున్నారు. జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. ఆరు విడతల్లో జోసా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.