Covid
Bio-war | వామ్మో డ్రాగన్​ కుట్రలు.. చైనా బయో యుద్ధం!.. పంటలపై హానికరమైన ఫంగస్​ వైరస్​ ప్రయోగం!

అక్షరటుడే, వెబ్​డెస్క్‌: Covid | దేశంలో కరోనా వైరస్‌ Corona Virus క్రమంగా కోరలు చాస్తుంది. అన్ని చోట్ల కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వాలు కూడా ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా కోరలు చాస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ(Health Department) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్‌ 1 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,758కి పెరిగింది. వీటిలో అత్యధికంగా కేరళలో 1400 కేసులు, మహారాష్ట్రలో 485, ఢిల్లీలో 436 కేసులు ఉన్నాయి. కోవిడ్‌(Covid)తో గత 24 గంటల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు కేరళకు చెందినవారు కాగా, మరొకరు కర్ణాటకకు చెందినవారు. కోవిడ్‌ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 28కి పెరిగింది.

Covid | విజృంభిస్తున్న క‌రోనా..

కోవిడ్‌తో గత 24 గంటల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవ‌డంతో భ‌యాందోళ‌న నెల‌కొంది.. కోవిడ్‌ Covid కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 28కి పెరిగింది. కోవిడ్‌ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పందించింది. వ్యాప్తిలో ఉన్న ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8.1 సబ్‌ వేరియంట్లను ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు’గా వర్గీకరించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆస్పత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్నా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమి లేవంటూ పేర్కొంది.

ఇక ఇప్పటికే ఆమోదం పొందిన కోవిడ్‌ వ్యాక్సిన్లు(Covid Vaccines) ఈ వేరియంట్‌ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం Fever , దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని కూడా సూచిస్తున్నారు. జ‌నసందోహం ఉన్న ప్రాంతాల‌కి వెళితే త‌ప్ప‌నిస‌రిగా మాస్క్(Mask) వాడాల‌ని సూచిస్తున్నారు. కోవిడ్‌ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.