అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actor Rajendra Prasad | సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Senior actor Rajendra Prasad) ఈ మధ్య విమర్శల పాలవుతున్నాడు. సభా మర్యాద లేకుండా బూతులు మాట్లాడుతుండడం ఎవరికీ నచ్చడం లేదు. రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో (Robinhood pre-release event) వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. వార్నర్‌పై ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని అందుకు వార్నర్‌కు (David Warner) క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు ఆలీని బూతు పదంతో తిడుతూ మరోసారి విమర్శల పాలయ్యాడు. మరోసారి పబ్లిక్ గా పెగ్గేసి వాగుతున్నారా అనే డౌట్ రావడంలో సందేహం లేదనేలా ప్రవర్తించారు.
Actor Rajendra Prasad | అదే తంతు..
ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కార్యక్రమానికి హాజరైన రాజేంద్రప్రసాద్, మైక్ అందుకుని ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.. “మీరందరూ వస్తున్నారని నాకు చెప్పలేదు, రాకుంటే నేను మిస్ అయ్యే వాడిని. ఏరా అచ్చన్న (నిర్మాత అచ్చిరెడ్డి) (producer Achchi Reddy).. బయటికి రా నీ సంగతి చూస్తా” అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. ఆ తర్వాత, “మా ఇద్దరికీ ఇది అలవాటే” అని చెబుతూ, “ఇక అలీగాడు ఎక్కడ ఉన్నాడు అనడంతో పాటు మరో బూతు వాడారు. ఇదంతా మనకు కామనే” అంటూ అలీని (Ali) ఉద్దేశించి తీవ్రమైన పదజాలం వాడినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడితో ఆగాడా.. సభలోని ప్రేక్షకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు.
తాను అంతకుముందు రోజు ఎన్టీఆర్ అవార్డు (NTR award) అందుకున్న విషయాన్ని ప్రస్తావించగా, అప్పుడు ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో, “ఏంటి మీరు చప్పట్లు కొట్టరా?” అని ప్రశ్నించి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. ఆ తర్వాత, “మీ అందరికీ బ్రెయిన్ పోయిందా?” అని, చప్పట్లు కొట్టకపోతే “సిగ్గు లేనట్టే” అంటూ మరికొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్స ఫైర్ అవుతున్నారు.