- Advertisement -
HomeUncategorizedPak high commission | పాక్‌ హై కమిషన్‌ కార్యాలయంలోకి కేక్‌లు ఎందుకు తీసుకెళ్లారు..?

Pak high commission | పాక్‌ హై కమిషన్‌ కార్యాలయంలోకి కేక్‌లు ఎందుకు తీసుకెళ్లారు..?

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pak high commission | కశ్మీర్‌లో ఉగ్రమూకలు సృష్టించిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యావత్‌ భారత దేశం దిగ్భ్రాంతిలో ఉన్నవేళ ఢిల్లీలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission office) వద్ద ఓ సిబ్బంది కేక్‌ తీసుకెళ్లడం చర్చకు దారితీసింది. ఓ సిబ్బంది కార్యాలయంలోనికి కేక్‌ను తీసుకెళ్తుండగా.. పలు జాతీయ మీడియా ఛానెళ్లు నిలదీశాయి. అయితే సదరు సిబ్బంది ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే లోనికి వెళ్లిపోయాడు. భారత్‌లో ఉగ్రదాడి(terrorist attack) ఘటనను నిరసిస్తూ.. యావత్‌ ప్రజానీకం నివాళులు అర్పిస్తోంది. అన్ని చోట్ల సంతాపాలు తెలుపుతున్నారు.

ఇలాంటి సమయంలో పాక్‌ హై కమిషన్‌ కార్యాలయంలో కేక్‌లు తీసుకెళ్లి సంబరాలు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఉగ్రదాడి ఘటనపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్‌తో దౌత్య సంబంధాలు(diplomatic relations) కట్‌ చేసుకోవడమే కాకుండా పాకిస్థానీలకు వీసాలను నిలిపివేసింది. ఆ దేశ పౌరులు ఇండియాను వదిలి వెళ్లాలని హెచ్చరించింది. పాక్‌ హై కమిషన్‌(Pakistan High Commission) కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను సైతం కుదించింది.

- Advertisement -

- Advertisement -
- Advertisement -
Must Read
Related News