Lottery ticket
Lottery ticket | లాటరీ రూ.30 కోట్లు.. ప్రియురాలికి ఇస్తే మరొకడితో జంప్‌..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Lottery ticket : అదృష్టం వరించింది. లాటరీలో ఊహించని విధంగా ఏకంగా రూ.30 కోట్లు వచ్చాయి. ఆ మొత్తాన్ని ఏడాదిన్నర కాలంగా తనతో లీవ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్న ప్రియురాలి అకౌంట్​లో వేశాడు. ఇదే అదనుగా ఆమె మరొకడితో పారిపోయింది. ఈ సాడ్​ స్టోరీ కెనడాలో చోటుచేసుకుంది.

విన్నిపెగ్‌కు చెందిన లారెన్స్ కాంప్‌బెల్(Lawrence Campbell) 2024లో లాటరీ టిక్కెట్‌ కొనుగోలు చేశాడు. అందులో అతడికి జాక్‌పాట్‌ తగిలింది. CA$5 మిలియన్ల(సుమారు రూ. 30 కోట్లు)(CA$5 million) మొత్తం లాటరీలో వరించింది. కాగా, ఆయనకు బ్యాంకు ఖాతా(bank account) లేకపోవడంతో తన గర్ల్‌ఫ్రెండ్‌ మెక్కే(McKay) అకౌంట్​లో నగదు జమ చేశాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. డబ్బు అకౌంట్​లో పడగానే మెక్కే మరొకడితో పారిపోయింది. దీంతో ఆమెపై లారెన్స్ కాంప్‌బెల్ కేసు పెట్టాడు. డబ్బు ఖాతాలో జమ చేసిన తర్వాత మెక్కే అదృశ్యమైందని కాంప్బెల్ ఫిర్యాదులో వెల్లడించాడు. తన ఫోన్‌ను లిఫ్ట్ చేయడం లేదని, తనను సోషల్‌ మీడియా(social media)లో బ్లాక్‌ చేసిందని వాపోయాడు.

మెక్కే ఆమె కోసం వెతికితే.. చివరికి ఆమె వేరొకడితో ఓ హోటల్‌లో మంచంపై కనిపించిందని లారెన్స్ తెలిపాడు. మొత్తానికి ప్రియురాలి(girlfriend)ని గుడ్డిగా నమ్మి కాంప్‌బెల్‌ మోసపోయాడు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. అతడికి ఎలా న్యాయం జరుగుతుందో చూడాలి.