- Advertisement -
HomeUncategorizedDanish Kaneria | పాక్‌పై సొంత క్రికెట‌ర్ తీవ్ర ఆరోప‌ణ‌లు.. ప‌హ‌ల్గామ్ దాడి వెనుక పాక్...

Danish Kaneria | పాక్‌పై సొంత క్రికెట‌ర్ తీవ్ర ఆరోప‌ణ‌లు.. ప‌హ‌ల్గామ్ దాడి వెనుక పాక్ పాత్ర ఉంద‌న్న క‌నేరియా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Danish Kaneria | భార‌త్‌లోకి ఉగ్ర‌వాదాన్ని పాకిస్తాన్‌ను ఆ దేశ మాజీ క్రికెట‌ర్ డానిష్ కనేరియా(Former cricketer Danish Kaneria) తీవ్రంగా విమర్శించాడు. నిజంగా ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో పాకిస్తాన్‌ పాత్ర లేక‌పోతే మ‌న ప్ర‌ధానమంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్‌(Prime Minister Shehbaz Sharif) ఎందుకు ఖండించ‌లేద‌ని ప్ర‌శ్నించాడు.

పాక్ ద‌ళాలు(Pakistan forces) అక‌స్మాత్తుగా ఎందుకంత అప్ర‌మ‌త్తయ్యాయ‌ని నిల‌దీశాడు. వాస్త‌వ‌మేమిటో మీకు తెలుసు. మీరు ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నార‌ని పాక్ తీరును “ఎక్స్‌”లో ఎండ‌గ‌ట్టాడు. “పాకిస్తాన్‌కు నిజంగా పహల్గామ్(Pahalgam) ఉగ్రవాద దాడిలో పాత్ర లేకపోతే, ప్రధాన మంత్రి ఇప్ప‌టిదాకా ఎందుకు ఖండించలేదు? మీ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తంగా ఉన్నాయి? ఎందుకంటే మీకు నిజం తెలుసు. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వారిని పెంచుతున్నారు. మీకు సిగ్గుచేటు అని” కనేరియా విమ‌ర్శించారు.

- Advertisement -

Danish Kaneria | గ‌తంలోనూ ఆరోప‌ణ‌లు..

పాకిస్తాన్ హిందూ క్రికెటర్ అయిన కనేరియా 2000 నుంచి 2010 మధ్య పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. స్పాట్ ఫిక్సింగ్(Spot fixing) ఆరోపణల తర్వాత అతనిపై పీసీబీ(PBC) జీవితకాల నిషేధాన్ని విధించింది. 2013లో అత‌డు అప్పీల్‌కు వెళ్ల‌గా ఫ‌లితం లేక‌పోయింది. చాలాకాలం త‌ర్వాత క‌నేరియా దీనిపై నోరు విప్పాడు. అప్ప‌ట్లో ఒక వ్య‌క్తి త‌న‌ను క‌లిశాడ‌ని, కానీ అత‌డు మ్యాచ్ ఫిక్స‌ర్(Match Fixer) అని త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. మ‌రో స‌మ‌యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి, ఆట‌గాళ్ల గురించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. హిందువు అయిన త‌న‌ను ఇస్లాంలోకి మారామ‌ని స‌హ‌చ‌ర క్రికెట‌ర్లు ఒత్తిడి చేసేవార‌ని వెల్ల‌డించాడు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News