అక్షరటుడే, వెబ్‌డెస్క్: heart attack : మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district)లో ఆదివారం (జూన్ 1) విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఏఎస్సె మృతి చెందిన ఘటన డిపార్ట్ మెంటులో విషాదం నింపింది. జిల్లాలోని కేసముద్రం పోలీస్ స్టేషన్(Kesamudram police station) లో పనిచేస్తున్న ఏఎస్సై కృష్ణ మూర్తి ఠాణాలోనే ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళనకు గురిచేసింది. విధుల్లో ఉండగానే సడెన్ గా హార్ట్అటాక్ రావడంతో మరణించారు. ఒక్కసారిగా గుండె పట్టేసినట్లు అవ్వడంతో ఆయన ఎదను పట్టుకుని అలాగే కుప్పకూలిపోయారు.
డ్యూటీలో ఉన్న ఇతర పోలీసులు సీపీఆర్(CPR) చేసినా ఫలితం లేకుండాపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇటీవల గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టు కావడం వైద్యులకే అంతుబట్టని పరిస్థితి. నాలుగు రోజుల క్రితం ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా(Mancherial district) జన్నారం(Jannaram )లో చోటుచేసుకుంది. మే 28న జన్నారం పంచాయతీ కార్యదర్శి(Panchayat Secretary) చంద్రమౌళి కుర్చీలోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా గుండెపోటుతో పడిపోయారు.