అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Russia – Ukraine War | రష్యా–ఉక్రెయిన్ యుద్ధం (Russia – Ukraine War) తీవ్రం అవుతోంది. ఓ వైపు యుద్ధం ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ప్రయత్నిస్తున్న సమయంలో ఇరు దేశాలు దాడులు చేసుకుంటుండటం గమనార్హం. మూడు రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా బీకర దాడులు చేసింది. మిసైళ్లతో ఆదేశంలోని ప్రధాన నగరాలపై విరుచుకు పడింది. ఈ క్రమంలో ఆదివారం ఉక్రెయిన్ ప్రతీకార దాడులకు దిగింది. వందలాది డ్రోన్లతో రష్యాపై దాడి చేసింది.
Russia – Ukraine War | రష్యాకు తీవ్ర నష్టం
రష్యాలోని ఎయిర్‌బేస్ (Russia Airbase)లే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులకు తెగబడింది. ఐదు ఎయిర్‌బేస్‌లపై డ్రోన్ దాడులు చేసింది. ఖలీనో, సవస్లేయ్కా, బోరిసోగ్లెబ్స్క్, బాల్టిమోర్ ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఇంధన గోడౌన్లు, ఆయుధ నిల్వలు ధ్వంసం చేసింది. సైబీరియాలోని బెలాయ ఎయిర్‌బేస్‌పైనా దాడి చేసింది. డ్రోన్ దాడుల్లో రష్యాకు చెందిన 40 విమానాలు ధ్వంసం అయినట్లు సమాచారం. మరోవైపు 524 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా ప్రకటించింది.