ePaper
More
    HomeతెలంగాణMinister Post | మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

    Minister Post | మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Post | రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న ఆరు పదవుల్లో నాలుగింటిని తాజాగా భర్తీ చేయాలని కాంగ్రెస్(congress)​ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ(Nalgonda) జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. వీరు ఇద్దరు నల్గొండ పార్లమెంట్​ నియోజకర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు. రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్​ నియోజకవర్గంలోని మునుగోడుకు కూడా ఒకసారి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తనకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.

    రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ ​(nizamabad), ఉమ్మడి ఆదిలాబాద్ ​(Adilabad) జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్​ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఓసీల్లో ఒకరికి మాత్రమే పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతూ.. తానూ సీనియర్​ నాయకుడినే అని, సమర్థత ఆధారంగా మంత్రి పదవి తనకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్టానంపై నమ్మకం ఉందన్నారు. బీజేపీలో నుంచి కాంగ్రెస్​లో చేరే సమయంలో, పార్లమెంట్​ ఎన్నికల సమయంలో తన మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్​ పెద్దలు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

    Latest articles

    Tea Side effects | టీ అధికంగా తాగడం వల్ల కలిగే అనర్థాలు, ఆ సమస్యలు మీకు తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tea Side effects | చాలామందికి టీ తాగడం ఒక వ్యసనం లాంటిది. ఉదయం...

    August 18 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 18 Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Jubilee Hills Congress | మంత్రుల ఎదుటే కోడిగుడ్లు, టొమాటోలతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

    అక్షరటుడే, హైదరాబాద్: Jubilee Hills Congress : గల్లీ నుంచి ఢిల్లీ(Delhi) దాకా.. అన్నట్లు కాంగ్రెస్​ పార్టీ (Congress...

    Muslim girl..get Rs. 5 lakh | ముస్లిం అమ్మాయిని పెళ్లాడితే రూ. 5 లక్షలు ఇస్తా : ఎమ్మెల్యే పాటిల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Muslim girl..get Rs. 5 lakh : ముస్లిం అమ్మాయిలను వివాహం చేసుకునే హిందూ యువకులకు...

    More like this