అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | గోసంగి, బేడ, బుడగ జంగం కులాల విద్యార్థులకు ఆదివారం ప్రతిభ పురస్కారాలు(Talent Awards) అందజేశారు. ఈ సందర్భంగా గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ.. ఎస్సీ ఉప కులాలకు రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva vikasam) పథకంలో మొదటి ప్రాధాన్యం కల్పించాలన్నారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటిన 150 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)అసోసియేట్ ప్రొఫెసర్ సరిత, ఎస్సీ 57 ఉప కులాల రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చన్న, రిటైర్డ్ ఎంఈవో సాయిలు, ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజు, సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కొండపల్లి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.