అక్షరటుడే, ఇందూరు: Munnuru Kapu Students | మున్నూరు కాపు విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత సంక్షేమ సంఘం (Telangana Munnuru Kapu Government Employees and Retired Welfare Association) ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతి (SSC), ఇంటర్లో (INTER) ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మున్నూరు కాపు విద్యార్థులు దేశానికి సేవ చేసేందుకు ముందుండాలన్నారు. చదువుతోపాటు అన్ని రంగాల్లో స్థిరపడాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం (BJP government) విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాపు కులస్థులు కేవలం వ్యవసాయం, రాజకీయాల్లోనే కాకుండా ఉన్నత పదవుల్లో రాణించాలన్నారు. అనంతరం 115 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు (BJP District President) దినేష్ కులాచారి, తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తోట రాజశేఖర్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస పటేల్, జిల్లా మున్నూరు కాపు సంఘం కోశాధికారి ధర్మపురి సురేందర్, నరాల రత్నాకర్, సంఘం ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ రవి, గౌరవాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన సలహాదారు ఆకుల ప్రసాద్, రేంజర్ల నరేష్, హరిచరణ్, నారాయణ రెడ్డి, స్వర్ణలత, స్వప్న, పుష్పకుమారి, తదితరులు పాల్గొన్నారు.