అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rinku Singh | ఐపీఎల్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన క్రికెటర్ రింకూ సింగ్ (Cricketer Rinku Singh) టీమిండియా జట్టులో కూడా స్థానం సంపాదించుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ(IPL) అదరగొడుతున్నాడు. అయితే మనోడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడు.. సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో (Samajwad Party MP Priya Saroj) నిశ్చితార్థం జరుపుకోబోతున్నాడు. తాజాగా రింకూ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 8న రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థం (engagement of Rinku Singh and Priya Saroj) నిర్వహించనున్నట్లు సమాచారం. లక్నో వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. కార్యక్రమం నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో జరగనున్నట్లు చెప్పుకొచ్చారు.
Rinku Singh | పెళ్లి టైం ఫిక్స్..
అనంతరం నవంబర్ 18న వివాహం చేసుకోబోతున్నారు. వారణాసిలోని హోటల్ తాజ్‌లో (Hotel Taj in Varanasi) ఈ వివాహం జరగనుంది. ఈ వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ, క్రీడా (Political, film and sports) ప్రముఖులు హాజరు కానున్నారు. వారి వివాహ వార్తల నేపథ్యంలో వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడంపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్ Priya Saroj తండ్రి కెరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ ఎమ్మెల్యే అయిన తుఫానీ సరోజ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అలీగఢ్‌లో రింకు కుటుంబాన్ని కలిశానని ఎమ్మెల్యే చెప్పారు. కుటుంబ సభ్యులు (Family members) వివాహానికి సిద్ధంగా ఉన్నారని ఐపీఎల్ తర్వాత వివాహం జరుగుతుందన్నారు.
ప్రియా సరోజ్ యూపీలోని మచ్లిషహర్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా (Lok Sabha MP) ఉన్నారు. ఆమె మొదటిసారి 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha elections) గెలిచింది. ప్రియా సరోజ్ నికర ఆస్తుల Properties గురించి మాట్లాడుకుంటే.. ఆమె మొత్తం ఆస్తులు రూ.11.25 లక్షలు. ఇందులో 10.18 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయబడింది. రూ.32వేల విలువైన బంగారం ఉంది. మరోవైపు భారత క్రికెటర్ రింకూ సింగ్ (Indian cricketer Rinku Singh) ఆస్తుల గురించి మాట్లాడుకుంటే.. రింకూ సింగ్ మొత్తం నికర ఆస్తుల విలువ దాదాపు రూ.8 నుంచి రూ.9 కోట్లు. ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రూ.13 కోట్లు చెల్లించి అతడిని నిలుపుకుంది. అంటే 2022 వేలంతో పోలిస్తే రింకూ సింగ్ జీతం దాదాపు 24 రెట్లు పెరిగింది. బీసీసీఐ రింకూ సింగ్‌కు ప్రతి సంవత్సరం దాదాపు రూ. 60 లక్షల నుంచి రూ.80 లక్షల రూపాయల జీతం ఇస్తుంది. రింకూ సింగ్ ఆస్తులు దాదాపు రూ.8 కోట్లుగా అంచనా వేయబడ్డాయి. కాగా 26 ఏళ్ల ప్రియా సరోజ్.. 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెందిన బీపీ సరోజ్‌ను 35,850 ఓట్ల తేడాతో ఓడించి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు.