Yellareddy
Yellareddy | ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల (Gandhari Government Junior College) ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ తరగతులు(Inter classes) ప్రారంభం కానున్నాయని తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తరగతులకు హాజరుకావాలని సూచించారు.

గాంధారి (Gandhari) మండలంలోని పేట్​సంగెం, పోతంగల్ (Pothangal), గండివేట్ (Gandivate) గ్రామాల్లో కళాశాలలో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాలలో పొందిన విద్యార్థులకు అదే రోజు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తామని, ప్రభుత్వం అందజేసే స్కాలర్​షిప్​లు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మణ్, జెట్టి విజయకుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.