అక్షరటుడే, కామారెడ్డి: Kamreddy | ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటికాడి నర్సింలు(45) గత కొన్నేళ్లుగా ప్యాసింజర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం సౌకర్యం కల్పించడంతో ఆటోల్లో మహిళా ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ఆటో సరిగ్గా నడవక.. ఫైనాన్స్ అప్పులు కట్టలేక మనస్తాపంలో నర్సింలు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సింలు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని.. వెంటనే అతడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేశారు.