అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని సెయింట్ జాన్స్ హైస్కూల్ (St. John’s High School) 1991–92 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం (Alumni Friends) జరుపుకున్నారు. నగరంలోని పటేల్స్ కమ్యూనిటీ హాల్లో (Patels Community Hall) పూర్వ విద్యార్థులంతా కలుసుకుని తమ గురువులను సన్మానించారు. 33 ఏళ్ల అనంతరం కలుసుకున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనందంగా ఆడిపాడారు.
