అక్షరటుడే, ఇందూరు: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌తో (Operation Sindoor)) ప్రపంచదేశాలకు భారత్ సత్తా తెలిసిందని ఎంపీ, బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ (BJP BC Morcha National president Laxman) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్‌కు (Pakistan) వత్తాసు పలికేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనేక యుద్ధ పరికరాల కోసం ప్రపంచ దేశాలు భారత్‌కు క్యూ కడుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ (Jairam Ramesh) ఎంపీలను ఉగ్రవాదులతో పోల్చడం సిగ్గు చేటన్నారు.
Operation Sindoor | కావాలనే కులగణనపై రాజకీయం..
కాంగ్రెస్ నాయకులు కులగణనపై (Caste Census) కావాలని రాజకీయం చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) బీసీల పొట్టకొట్టాలని చూస్తున్నారన్నారు. జనగణన సెంట్రల్ పరిధిలోనిది, కాంగ్రెస్ (Congress party) అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తమ నాయకుడు రాజ్‌నాథ్‌సింగ్ 2021లోనే జనగణన చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామన్నారు.
తమకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందని తెలిపారు. అలాగే అగ్రవర్ణ పేదల కోసం ఈ డబ్ల్యూఎస్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి చేసింది జైహింద్ యాత్ర (JaiHind Yatra) కాదని, జై పాకిస్తాన్ యాత్ర అని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, స్రవంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.