అక్షరటుడే, కామారెడ్డి: Tahsildars Transfers | కామారెడ్డి జిల్లాలో భారీగా రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఉత్తర్వులు జారీ చేశారు. సదాశివనగర్ (Sadashivnagar) తహశీల్దార్ గంగాసాగర్ బీబీపేటకు బదిలీ కాగా.. అక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ సత్యనారాయణ సదాశివనగర్‌కు వెళ్లారు. తాడ్వాయి (Tadwai) తహశీల్దార్‌గా మాచారెడ్డి (machareddy) తహశీల్దార్ శ్వేత, భిక్కనూరు(Bhiknoor) తహశీల్దార్ శివప్రసాద్ ఆర్డీవో కామారెడ్డి కార్యాలయం డీఏవోగా బదిలీ అయ్యారు.
కామారెడ్డి ఆర్డీవో కార్యాలయ డీఏవో సునీత భిక్కనూరు తహశీల్దార్‌గా ట్రాన్స్ఫర్ అయ్యారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ సరళను మాచారెడ్డి తహశీల్దార్‌గా బదిలీ చేశారు. నస్రుల్లాబాద్ (Nasrullabad) తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ డొంగ్లీకి, బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ డీఏవో సువర్ణ నస్రుల్లాబాద్ తహశీల్దార్‌గా నియమితులయ్యారు. డొంగ్లీ తహశీల్దార్ అనిల్ కుమార్‌ను బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ డీఏవోగా నియమించగా కలెక్టరేట్ సూపరింటెండెంట్ సుధాకర్‌ను దోమకొండ తహశీల్దార్‌గా నియమించారు. ఆర్డీవో కార్యాలయ నాయబ్ తహశీల్దార్ లక్ష్మణ్‌ను గాంధారి తహశీల్దార్ కార్యాలయానికి, కామారెడ్డి డీసీఎస్వో కిష్టయ్యను రామారెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై పంపిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.