- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | వ్యక్తి అనుమానాస్పద మృతి

Kamareddy | వ్యక్తి అనుమానాస్పద మృతి

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి:Kamareddy | అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ(Kamareddy Municipality) పరిధిలోని సరంపల్లి గ్రామం(Sarampalli village)లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న బాపురాజు(45)కు రోజు కల్లు తాగే అలవాటు ఉంది. అయితే కల్లు తాగడం ఎక్కువైతే అతని స్నేహితులు ఇంటివద్ద వదిలేసి వెళ్తుంటారు.

ఎప్పటిలాగే బుధవారం రాత్రి కూడా కల్లు ఎక్కువ తాగడంతో స్నేహితులు ఇంటివద్ద వదిలేసి వెళ్లినట్టుగా తెలిసింది. ఉన్నఫలంగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఆస్పత్రి(Hospital)కి తరలిచంగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో ఎవరైనా దాడి చేశారేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News