అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heroine Kalpika | సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ కావడానికి ఇటీవల చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్లిక్‌లో న్యూసెన్స్ చేయడం, ప్రమాదకరమైన సాహసాలు చేయడం లాంటివి చేస్తూ ఫేమస్ కావాలని చూస్తున్నారు. మరికొందరేమో బూతులు మాట్లాడుతూ, అసభ్యకరంగా నటిస్తూ రీల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారు తమ ఫాలోవర్స్(Fallowers) కోసం అప్పుడప్పుడు పిచ్చి చేష్టలు చేస్తుంటారు. తాజాగా ఇలాగే ఓ హీరోయిన్ తన సబ్స్క్రైబర్స్ అటెన్షన్ కోసం పబ్‌లో హల్చల్ చేసింది.
హైదరాబాద్(Hyderabad)లోని ప్రిజం పబ్‌లో సిబ్బంది తనపై దాడి చేశారని ఇటీవల హీరోయిన్ కల్పిక (Heroine Kalpika) పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రిజం పబ్ (Prisam Pub)కు వెళ్లిన సమయంలో కేక్ విషయంలో ఆమె వారితో గొడవ పడింది. పబ్ సిబ్బందితో ఆమె వాగ్వాదం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తప్పు హీరోయిన్ కల్పికదే అని పోలీసులు తేల్చారు. సబ్స్క్రైబర్ల కోసమే పబ్‌లో కల్పిక కావాలనే హల్చల్ చేసినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే పబ్ నిర్వాహకులే తనతో దురుసుగా ప్రవర్తించారని హీరోయిన్ అంటోంది.
కల్పిక గణేశ్(Kalpika Ganesh) తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఆరెంజ్ సినిమాలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం ఆఫర్లు లేకుండా ఉన్న ఈమె వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.