అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mercedes AMG G 63 | దేశంలో ఎస్‌యూవీ(SUV)లకు ఆదరణ పెరుగుతోంది. మెర్సిడెస్ కూడా భారత దేశ మార్కెట్‌ను (Indian Market) దృష్టిలో ఉంచుకుని ఏఎంజీ జీ 63 ప్రత్యేక వర్షన్ కలెక్టర్స్ ఎడిషన్‌ను తీసుకువస్తోంది. వైబ్రెంట్ ఆరెంజ్ కలర్, సిల్వర్ వీల్స్‌తో దీనిని తీసుకువస్తున్నట్లు ఇటీవల రివీల్ చేసిన టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ (Limited edition). తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తారు. ఎక్స్ షోరూం ధర రూ. 3.5 కోట్లనుంచి రూ. 4 కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. లగ్జరీ కారు(Luxury car) కోసం చూసేవారికోసం దీనిని తీసుకువస్తున్నారు. ఈనెల 12న మార్కెట్‌లో లాంచ్ కానున్న ఈ మోడల్ వివరాలు తెలుసుకుందామా..
Mercedes AMG G 63 | ఇంటీరియర్..
కస్టమ్ సీట్ కవర్లు (Ceat Covers), బ్యాడ్జింగ్‌ను కలిగి ఉంటుంది. డ్యుయల్ డిజిటల్ స్క్రీన్‌లు, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి ఫీచర్లున్నాయి. 12 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, లెదర్ బైండ్ AMG స్టీరింగ్ వీల్‌తో విలాసవంతమైన అనుభూతి కలుగుతుంది.
Mercedes AMG G 63 | ఎక్స్‌టీరియర్..
కస్టమ్ అల్లాయ్ వీల్స్, బంపర్లు, వీల్ ఆర్చ్ ఎక్స్‌టెన్షన్స్. ఐకానిక్ జీ- క్లాస్ డిజైన్ (Iconic G-Class Design). బాక్సీ ఆకృతి, రౌండ్ హెడ్ ల్యాంప్స్, ప్లాట హుడ్, బూట్ డోర్‌పై స్పేర్ వీల్.
Mercedes AMG G 63 | ఇంజిన్ సామర్థ్యం..
4.0 లీటర్ ట్విన్ టర్బో చార్జ్డ్ వీ8 ఇంజిన్. 48 వీ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 585hp (430 kW) శక్తి, మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా అదనంగా 22 హెచ్‌పీ(16కేడబ్ల్యూ) బూస్ట్ లభిస్తుంది. 850 Nm టార్క్‌ను అందిస్తుంది. హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా అదనపు తక్షణ టార్క్ అందుబాటులో ఉంటుంది.
Mercedes AMG G 63 | ట్రాన్స్‌మిషన్..
9 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ (Automatic Gear box) కలిగి ఉంది. ఇది త్వరగా గేర్లను మార్చడం కోసం రూపొందించబడింది. 4 MATIC ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, లో రేంజ్ గేరింగ్, సెంటర్, ఫ్రంట్, రేర్ లాకింగ్ డిఫరెన్షియల్స్.
Mercedes AMG G 63 | పనితీరు..
4.5 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. వేగ పరిమితి గంటకు 220 కిలోమీటర్లు. లీటరుకు 8 -10 కిలోమీటర్ల మైలేజ్ రావొచ్చు.
Mercedes AMG G 63 | ఆఫ్ రోడ్ సామర్థ్యం..
ఏఎంజీ రైడ్ కంట్రోల్ అడాప్టివ్ డ్యాంపింగ్, ఎన్‌హాన్స్‌డ్ వీల్ ఆర్టిక్యులేషన్, ఆల్ టెరైన్ డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. రోడ్ల పరిస్థితికి అనుగుణంగా సస్పెన్షన్‌ను సర్దుబాటు చేస్తుంది.
Mercedes AMG G 63 | బ్రేకింగ్ సిస్టమ్..
ఏఎంజీ హై పర్మార్మెన్స్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చారు. ఫ్రంట్, రేర్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్, ఆప్షనల్ కార్బన్ సిరామిక్ బ్రేక్స్ ఉన్నాయి.