ePaper
More
    HomeజాతీయంLiquor | మీకు తెలుసా.. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం తీసుకుంటార‌ని..!

    Liquor | మీకు తెలుసా.. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం తీసుకుంటార‌ని..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Liquor | ఈ రోజుల్లో ఫంక్ష‌న్స్, పార్టీస్‌లాంటివి ఉంటే మ‌ద్యం త‌ప్ప‌నిస‌రి అయింది. మ‌నం ఎన్ని వెరైటీల ఫుడ్ పెట్టినా కూడా మందు పోసామా లేదా అన్న‌దే ప్ర‌స్టేజ్‌గా చూస్తున్నారు. మ‌ద్యం ప‌లు రాష్ట్రాల‌లో ఏరులై పారుతుంది. భారతదేశంలో దాదాపు 160 మిలియన్ల మంది మద్యం తాగుతున్నారు. కాగా.. వీరిలో 95 శాతం మంది పురుషులు ఉండగా, వీరి వయస్సు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని నివేదికలు వెలువడుతున్నాయి. దేశంలో యేటా బిలియన్ల లీటర్ల మద్యం (Billion liters Liquor Consumption) వినియోగిస్తున్నారు. తాజాగా జ‌రిగిన ఓ స‌ర్వేలో ఏ రాష్ట్రాల‌లో ఎక్కువ‌గా మ‌ద్యం సేవిస్తున్నారనేది చూస్తే గోవా టాప్ 5లో ఉంది. 36.9 శాతం మంది మ‌ద్యం సేవిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.

    Liquor | తాగుడే తాగుడు..

    ఇక టాప్ 4లో మ‌ణిపూర్ (Manipur) ఉంది. ఇక్క‌డ 37.5 శాతం మంది లిక్కర్ తీసుకుంటారు. ఇక టాప్ 3లో సిక్కిం 39.8 శాతం ఉంది. టాప్ 2లో తెలంగాణ 43.4 శాతం, టాప్ 1లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ 52.7 శాతంతో ముందుంది. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), తమిళనాడు (Tamilnadu), కర్ణాటక (Karnataka), కేరళ (Kerala) రాష్ట్రాలు.. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం మద్యంలో 45 శాతం వినియోగిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే సౌత్ లోనే మద్యం ప్రియులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది తాగేవాళ్లు మన దక్షిణాదిలోనే ఉన్నారు. గత కొంత కాలంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో తాగేవారి సంఖ్య తగ్గింది. కానీ వీర లెవల్లో తాగేవాళ్ల సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి.

    ఇక మన దేశంలో మ‌హిళలు (Womens) కూడా ఎక్కువ మ‌ద్యం తాగుతారు. అయితే ఏ రాష్ట్రంలో మద్యం ఎక్కువగా తాగే మహిళలు ఉన్నారో మీకు తెలుసా? కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Union Ministry of Health and Family Welfare) ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో మొదటి మూడు స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలే ఉన్నాయి. అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతం ఉంది. అసోంలో ఇది 16.5 శాతం, మేఘాలయలో 8.7 శాతంగా ఉందని ఓ సర్వేలో వెల్లడైంది.

    More like this

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...