ePaper
More
    HomeసినిమాManchu Vishnu | హార్డ్ డిస్క్ మంచు మ‌నోజ్ ద‌గ్గ‌రే ఉందా.. విష్ణు కామెంట్స్‌పై భైర‌వం...

    Manchu Vishnu | హార్డ్ డిస్క్ మంచు మ‌నోజ్ ద‌గ్గ‌రే ఉందా.. విష్ణు కామెంట్స్‌పై భైర‌వం హీరో క్లారిటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manchu Vishnu | గ‌త కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో (Manchu Family) గొడవలు జరుగుతూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మంచు మనోజ్.. మంచు విష్ణు (Manchu manoj and manchu vishnu) మధ్య రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఆస్తిపరంగా గొడవలు జరుగుతూ ఉండగా.. అసలు ఈ ఆస్తి గొడవలు వచ్చిందే మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాపై (manchu vishnu kannapa movie) ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల అనే టాక్ కూడా న‌డిచింది. అయితే ఇప్పుడు క‌న్న‌ప్ప జూన్ 27న రిలీజ్‌కు సిద్ధం కాగా, ఆ సినిమా హార్డ్ డిస్క్.. ఎవరో దొంగతనం చేశారు. అయితే ఆ హార్డ్ డిస్క్..(hard disk)లో ఏకంగా ప్రభాస్ సీన్స్ ఉన్నాయి.. అని ఆ సీన్స్ మొత్తం ఆన్ లైన్ లో పెట్టేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి.. అంటూ కన్నప్ప టీం (kannapa movie team) చెప్పుకొచ్చారు..

    Manchu Vishnu | ఏంటి.. ఈ ర‌చ్చ‌

    ఇక ఇటీవల చెన్నైలో జరిగిన సినిమా ప్రచారంలో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందిస్తూ.. తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో (manchu manoj house) పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. వారే స్వయంగా చేశారా.. ? లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు. దానికి తాజాగా మంచు మ‌నోజ్ స్పందించారు. తాను న‌టించిన భైర‌వం సినిమా కోసం నిర్వహించిన సక్సెస్ ఈవెంట్ (success event)లో ఆ టాపిక్ గురించే మాట్లాడాలని అనుకుంటున్నా. నేను మొన్ననే చెప్పాను.. ఒకప్పుడు సరదాగా ఫన్ చేసాను. కానీ ఒక సినిమా కోసం ఎందరో కష్టపడతారు. ‘భైరవం’ సక్సెస్ ప్రమోషన్స్ (Bhairavam success promotions) పాజిటివిటీ మధ్య ఎవరూ నన్ను రెచ్చగొట్టలేరు. ఇంతమంది ప్రేమ ముందు అదేమీ కనిపించడం లేదు. నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పను. కానీ ‘కన్నప్ప’ సినిమాకి నా బెస్ట్ విషెస్ అందజేస్తున్నా. గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా దేవుడ్ని కోరుకుంటున్నా.” అని మంచు మనోజ్ పేర్కొన్నారు.

    హార్డ్ డ్రైవ్ దొంగతనం కేసులో ర‌ఘు, చరిత‌లు పేర్లు బ‌య‌ట‌కు రాగా, రఘు.. మనోజ్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడని, చరిత కూడా మనోజ్ (Manchu Manoj) ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి అని మంచు విష్ణు అన్నారు. 45 రోజుల క్రితం హైవ్ స్టూడియోస్ నుంచి వచ్చిన హార్డ్ డ్రైవ్ (hard drive) పార్శిల్‌ను విష్ణు ఇంటి సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ సిబ్బంది అడ్డుకున్నారని.. ఇప్పుడు కూడా ఇది వాళ్ళ పనే అని మంచు విష్ణు ఆరోపించారు. ఇప్పటికే చాలా వివాదాలతో మంచు కుటుంబం రోడ్డు మీదకు వచ్చింది. కాగా ఇప్పడు హార్డ్ డ్రైవ్ గొడవతో ఈ గొడవలు మరింత ముదరనున్నాయ‌ని పలువురు అంటున్నారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...