అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Disciplinary Committee | కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా డిసిప్లినరీ కమిటీలో నిజామాబాద్ అర్బన్ (Nizamabad Urban) నుంచి డాక్టర్ జీవీ రామకృష్ణ (G.V. Ramakrishna) సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా.. డాక్టర్ జీవీ రామకృష్ణను శనివారం స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శోభన్, రాంభూపాల్, శ్రీనివాస్, సదానంద చారి, రామర్తి గోపి పాల్గొన్నారు.