ePaper
More
    HomeతెలంగాణPRTU Telangana | సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి

    PRTU Telangana | సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: PRTU Telangana | రాష్ట్ర ప్రభుత్వం టీచర్లను సర్దుబాటు చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చిన అశాస్త్రీయ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ (PRTU Telangana District President Kripal Singh) డిమాండ్ చేశారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. బడిబాట తర్వాత విద్యార్థుల నమోదు ఆధారంగా సర్దుబాటు చేయాలన్నారు.

    ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నారు. అలాంటి అవసరమైన టీచర్లను కూడా సర్దుబాటు పేరుతో తొలగిస్తే గుణాత్మక విద్య శూన్యమవుతుందన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుకుంటున్న తరుణంలో, పిల్లల భవిష్యత్తును చీకట్లోకి నెట్టే ఉత్తర్వులు తక్షణమే రద్దు చేయాలన్నారు. జూలై లేదా ఆగస్టులో సర్దుబాటు చేయాలన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...