Miss World 2025 | మిస్ వరల్డ్ 2025 విజేత థాయిలాండ్ సుందరి
Miss World 2025 | మిస్ వరల్డ్ 2025 విజేత థాయిలాండ్ సుందరి

అక్షరటుడే, హైదరాబాద్: Miss World 2025 : నెలరోజులపాటు ఉత్కంఠగా సాగిన 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. మిస్ వరల్డ్ 72 విజేతగా థాయిలాండ్ సుందరి నిలిచింది. మిస్ వరల్డ్ ప్రపంచ కిరీటాన్ని దక్కించుకుంది.

మిస్ థాయిలాండ్ ఓపల్​ సుచాత చువాంగ్ (Miss Thailand Opal Suchata Chuang) మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై ఆమెకు మిస్ వరల్డ్ కిరీటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), జూలియా ధరించారు.

3వ రన్నర్ అప్ మిస్ మార్టినిక్(Miss Martinique), 2వ రన్నర్ అప్ మిస్ పోలాండ్(Miss Poland), 1వ రన్నర్ అప్ మిస్ పోలెండ్ ఎంపికయ్యారు.

మిస్​ వరల్డ్ 2025 పోటీల్లో మొత్తం 108 దేశాల కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. మిస్‌ ఇండియా నందిని గుప్తా టాప్‌-8లో సైతం స్థానం దక్కించుకోలేకపోయారు.

కాగా, మిస్‌ వరల్డ్ విజేతకు రూ. 8.50 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, సినీ ప్రముఖులు ఈ మిస్‌వరల్డ్‌ ఫైనల్స్‌ వేడుకలకు హాజరయ్యారు.

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Bollywood actress Jacqueline Fernandez) నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బ్యూటీ విత్‌ పర్పస్‌(Beauty with Purpose) విజేతగా మిస్‌ ఇండోనేషియా మోనికా కెజియా(Miss Indonesia Monica Kejia) నిలిచింది. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సుధారెడ్డి ఎంపిక అయ్యారు.

ఇక సినీనటుడు రానా చేతుల మీదుగా సోనూసూద్(Sonu Sood) మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ పురస్కారం(Miss World Humanitarian Award) సొంతం చేసుకున్నారు.