అక్షరటుడే, ఇందూరు : Prajavani | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana State Formation Day) వేడుకల నేపథ్యంలో జూన్ 2 వ తేదీన జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) తెలిపారు. తిరిగి జూన్ 9వ తేదీ నుండి ప్రతీ సోమవారం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
