Nizamabad CP Sai chaitanya
CP Sai Chaitanya | పశువుల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | బోధన్ (Bodhan) డివిజన్ పరిధిలోని సాఠాపూర్, బోర్గాం గ్రామ సరిహద్దులో పశువుల కొనుగోలు కేంద్రాలను శనివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) తనిఖీ చేశారు.

పశువుల కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా నిబంధనల ప్రకారం విక్రయాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ Bodhan Acp srinivas, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.