ePaper
More
    HomeతెలంగాణAnganwadi | అంగన్​వాడీలకు శుభవార్త.. బెనిఫిట్స్​ పెంచిన ప్రభుత్వం

    Anganwadi | అంగన్​వాడీలకు శుభవార్త.. బెనిఫిట్స్​ పెంచిన ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anganwadi | అంగన్​వాడీ ఉద్యోగుల(Anganwadi Employees)కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. వారికి ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ (Retirement Benifits)​ పెంచుతూ జీవో జారీ చేసింది. గతంలో అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ విమరణ ఉండేది కాదు. చాలా మంది జీవిత కాలం పని చేసేవారు. అయితే ఏడాది క్రితం ప్రభుత్వం అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విమరణ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.

    కాగా.. రిటైర్మెంట్​ వయసును 65 ఏళ్లుగా పేర్కొంది. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్​ కింద అంగన్​వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని అంగన్​వాడీ ఉద్యోగులు కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఉద్యోగ విరమణ ప్రయోజనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

    Anganwadi | రూ.2 లక్షలకు పెంపు

    అంగన్​వాడీ ఉద్యోగుల డిమాండ్​ మేరకు ప్రభుత్వం తాజాగా రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ పెంచుతూ జోవో జారీ చేసింది. అంగన్​వాడీ టీచర్లకు(Anganwadi Teachers) రూ.రెండు లక్షలు, ఆయాలకు (Anganwadi Helpres) రూ.లక్ష చొప్పున ఇక నుంచి ఉద్యోగ విరమణ సందర్భంగా ఇస్తామని తెలిపింది. అలాగే 60 ఏళ్లు దాటి వీఆర్‌ఎస్(VRS) తీసుకునే టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్​వాడీ టీచర్లను అప్​గ్రేడ్​ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 3,989 టీచర్లు ఉండేవారు. వీరికి రూ.7,800 వేతనం వచ్చేది. అయితే వీరిని అంగన్​వాడీ టీచర్లుగానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి రాష్ట్రంలో మినీ అంగన్​వాడీలు ఉండవని తెలిపింది. దీంతో వారికి రూ.13,560 వేతనం అందనుంది.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...