Nizamabad
Nizamabad | సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

అక్షరటుడే, ఇందూరు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (PACS) పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సొసైటీ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం డీఎల్‌ఈసీ(DLEC), ఎన్‌డీసీసీ(NDCC) అధ్యక్షులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో నం.44 ప్రకారం డీఎల్‌ఈసీ ఫండ్‌ ద్వారా వేతనాలు ఇవ్వాలన్నారు. అలాగే బదిలీలు చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని కోరారు. పీఆర్సీ(PRC) వెంటనే అందించాలని విన్నవించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దయాసాగర్, నాయకులు పాల్గొన్నారు.