అక్షరటుడే, వెబ్డెస్క్ : Srikalahasti | ఆలయాల్లోకి ప్రముఖులు వచ్చినప్పుడు కొందరు ఉద్యోగులు, అర్చకులు ప్రత్యేకంగా రిసీవ్ చేసుకుంటారు. కొందరైతే ఆలయ నిబంధనలు పాటించకుండా కూడా ప్రముఖుల కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ప్రత్యేకించి గర్భ గుడిలోకి ప్రవేశం కల్పించడం, ప్రత్యేక పూజలు, ఆలయాల్లో కెమెరా అనుమతించడం లాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ హీరో కోసం ప్రత్యేక పూజలు చేసిన అర్చకుడిపై అధికారులు వేటు వేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి (Srikalahasti )లోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ నెల 29న సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబం (Srikanth Family) నవగ్రహ శాంతి పూజలు చేయించుకుంది. అయితే శ్రీకాంత్ ఫ్యామిలీకి శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకుడు ప్రత్యేకంగా ప్రైవేటుగా పూజలు చేయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో విచారణ జరిపి, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అర్చకుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు.