అక్షరటుడే, వెబ్‌డెస్క్: Srileela | టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల Sreeleela నిశ్చితార్థం అంటూ గత రెండు రోజులుగా పలు వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ కావడంతో శ్రీలీల ఎంగేజ్‌మెంట్(Engagement) అయిపోయిందంటూ ప్రచారం జరిగింది. పిక్స్‌లో శ్రీలీల వధువులా దుస్తులు ధరించి కనిపించింది. ఆమె బుగ్గలకు పసుపు పూసినట్లు చూపించే కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఇది భారతీయ ఆచారాలలో సాంప్రదాయ వివాహానికి ముందు ఆచారం. ఇక ఈ పిక్స్ కు శ్రీలీల “ఈ రోజు నాకు గొప్ప రోజు. నేను త్వరలో పూర్తి వివరాలను పంచుకుంటాను. త్వరలో వస్తుంది” అని ఒక శీర్షికను జోడించింది.
Heroine Srileela | అసలు విషయం ఇది..
ఇది ఆమె అభిమానులలో తీవ్ర ఊహాగానాలకు దారితీసింది. ఈ పోస్టును చూసిన వారంతా షాకవుతున్నారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే శ్రీలీల పెళ్లి చేసుకుంటుందా అని డైలమాలో పడ్డారు. అయితే కొందరు ఈ పిక్స్‌పై రాబోయే చిత్రం లేదా వాణిజ్య ప్రకటన కోసం ప్రచార ప్రచారంలో భాగం కావచ్చని కామెంట్ చేశారు. అయితే ఈ అనుమానాల నడుమ శ్రీలీల తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. జూన్ 14న తన పుట్టిన రోజు ఉండడంతో ముందుగానే తన ఇంట్లో సంప్రదాయం ప్రకారం సెలబ్రేట్ చేస్తారని తెలిపింది. తన తల్లి ముందుగానే సెలబ్రేషన్స్ మొదలు పెట్టిందని పెట్ డాగ్ షేర్ చేస్తూ.. బ్లెస్ చేయమంటూ ఈ రోజు డేట్ కూడా పెట్టింది. దీంతో ఆమె ఎంగేజ్‌మెంట్‌కి (Engagement) సంబంధించి వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది.
శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది. గతంలో బెంగళూరు, హైదరాబాద్‌లకే పరిమితమైన శ్రీలీల ఇప్పుడు ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతోంది. బాలీవుడ్(Bollywood)లో నటిస్తోంది కాబట్టి అది సహజమే అనుకున్నా.. అంతకుమించి ఏదో జరుగుతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్(Ibrahim Ali Khan)తో కనిపించి అప్పట్లో శ్రీలీల వార్తల్లో నిలిచింది. ఆ వెంటనే కార్తీక్ ఆర్యన్‌తో (Kartik Aryan) శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపించాయి. కొద్దిరోజుల క్రితం వేవ్స్ 2025 సదస్సులో కార్తీక్ ఆర్యన్ తల్లితో ఈ చిన్నది కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్లయ్యింది. దీనికి కొద్దిరోజుల ముందు కూడా తనకు కాబోయే కోడలు డాక్టర్ అయితే బాగుంటుందని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో అందరిలో అనేక అనుమానాలు తలెత్తాయి. మరి చివరికి శ్రీలీల ఎవరిని వివాహం చేసుకుంటుందో చూడాలి.