ePaper
More
    HomeతెలంగాణIndiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి

    Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో తహశీల్దార్లతో శనివారం సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుకను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేకంగా జారీ చేసిన వేబిల్లులను అందించాలని సూచించారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) నిర్మాణాల పేరుతో ఇసుక పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఎంపీడీవోలు, ఎంపీవోలను సంప్రదించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. వర్షాలు ప్రారంభమైతే వాగులు, నదుల్లో వరద జలాలు చేరుకొని ఇసుక లభించే పరిస్థితి ఉండదన్నారు. ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయనే ఫిర్యాదులు రాకూడదని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ పాల్గొన్నారు.

    More like this

    Prithvi Shaw | పృథ్వీ షాకు కోర్టు జరిమానా: కోర్టు నోటీసులను పట్టనందుకు రూ.100 జరిమానా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Prithvi Shaw | భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు....

    Pochampad Village | ‘సెంట్రల్‌’ వెలుగులెప్పుడో..!.. అంధకారంలో పోచంపాడ్‌ మార్గం

    అక్షరటుడే, మెండోరా : Pochampad Village | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను చూసేందుకు జిల్లాతోపాటు ఇతర...

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ...