ePaper
More
    HomeతెలంగాణMla Dhanpal Suryanaraya Guptha | ఫుట్​పాత్​లపై ఆక్రమణలను తొలగించాలి

    Mla Dhanpal Suryanaraya Guptha | ఫుట్​పాత్​లపై ఆక్రమణలను తొలగించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Suryanaraya Guptha | నగరంలో ఫుట్​పాత్ లపై ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్​ను క్రమబద్దీకరించాలని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (District Police Commissioner Sai Chaitanya), నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్​తో శనివారం (Municipal Commissioner Dilip Kumar) నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని వాపోయారు. సిగ్నల్స్, వన్​వే రోడ్, పార్కింగ్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

    అలాగే జిల్లాలో డ్రగ్స్ (Drugs), గంజాయి (Marijuana) మహమ్మారి విచ్చలవిడిగా సరఫరా జరుగుతోందని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాంగ్​వార్​తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అల్లరిమూకలను ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి(ACP Raja Venkata Reddy), ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...