ePaper
More
    HomeతెలంగాణMaoists | జూన్ 10న భారత్ బంద్​.. మావోల పిలుపు

    Maoists | జూన్ 10న భారత్ బంద్​.. మావోల పిలుపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌:Maoists | మావోయిస్టులు భారత్​ బంద్​(Bharat Bandh)కు పిలుపునిచ్చారు. బంద్ లో అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.

    ఇటీవల ఛత్తీస్​గఢ్​లోని నారాయణపూర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో 27 మంది మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో మావోల అగ్రనేత నంబాల కేశవరావు (Maoists Leader Nambala Kesava Rao), సహ పలువురు కీలక నేతలు హతమయ్యారు. ఈ ఘటనకు నిరసనగా జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్(maoist leader Abhay) తెలిపారు.

    జూన్‌ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తామని తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు(Maoists) మృతి చెందారన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడం లేదని మావోయిస్టులు పేర్కొన్నారు. రెండు నెలలుగా తాము సంయమనం పాటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల ఫాసిస్ట్‌ వైఖరికి నిరసనగా బంద్​కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

    Maoists | వరుస ఎన్​కౌంటర్లతో కుదేలు

    దేశంలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ కగార్​లో భాగంగా బలగాలు అడవుల్లో నిత్యం కూంబింగ్ (Coombing)​ చేపడుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో భారీగా నక్సల్స్​ మృతి చెందారు. దీంతో మావోయిస్టులు తాము శాంతి చర్చలకు సిద్ధమని, ఆపరేషన్​ కగార్​ ఆపాలని కోరుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ఆపరేషన్​ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...