అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Covid Cases | కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న కరోనా(Corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గతంలో వేలాది మంది ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ తాజాగా దేశంలో వేగంగా వ్యాపిస్తోంది.
దేశంలో వర్షాకాలం ప్రారంభమైంది. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం. సరిగ్గా ఇప్పుడే కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఢిల్లీ(Delhi)లో కరోనాతో 60 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఢిల్లీలో ఇప్పటి వరకు రెండు కరోనా మరోణాలు సంభవించాయి. దేశంలో ఇప్పటి వరకు 22 మంది కోవిడ్(Covid)తో మరణించారు.