అక్షరటుడే, ఇందూరు: Ex Mla Bigala Ganesh Guptha | మాక్లూర్లోని పాండురంగ స్వామి ఆలయ (Panduranga Swamy Temple) ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా 2023లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణులకు గోదానం, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. బిగాల గణేష్ గుప్తా 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో ఏకబిల్వం, కొబ్బరి మొక్కలను నాటారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిర్పరాజు, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.