ePaper
More
    HomeజాతీయంNIA Searches | దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ సోదాలు.. ఉగ్రలింకులపై ఆరా

    NIA Searches | దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ సోదాలు.. ఉగ్రలింకులపై ఆరా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :NIA Searches | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం ఎన్​ఐఏ అధికారులు (NIA Officers) సోదాలు నిర్వహించారు. ఇటీవల పహల్గామ్​ ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​ అనంతరం భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

    ఆపరేషన్​ సిందూర్​తో భారత్​ పాక్​(Pakistan)లోని ఉగ్రవాదుల పని పట్టింది. అనంతరం రెండు దేశాలు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విమరణకు రెండు దేశాలు అంగీకరించాయి. అయితే ఆపరేషన్​ సిందూర్​తో ఉగ్రవాదులు పీచం అణచిన భారత్.. తాజాగా ఇంటి దొంగల పని పడుతోంది. ఇందులో భాగంగానే ఎన్​ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.

    NIA Searches | 15 ప్రాంతాల్లో..

    దేశంలోని పలువురు పాకిస్తాన్​ గూఢచర్యం చేస్తున్నట్లు ఇటీవల నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు ఇప్పటికే పలువురిని పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. అలాగే పలువురికి ఉగ్రవాదులతో లింక్​లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఎన్​ఐఏ ఏడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించింది. ఉగ్ర లింకులపై ఏకకాలంలో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, అస్సాంలలో సోదాలు చేపట్టింది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...