అక్షరటుడే, వెబ్‌డెస్క్ :AB Devilliers | క్రికెట్‌లోకి ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రం అలా నిలిచిపోతారు.
ఆట ఆడే విధానాన్ని, చూసే పద్ధతిని మార్చేసి కొత్త తరానికి బాటలు వేస్తారు. ఒకప్పుడు ధనాధన్ షాట్లతో బౌలర్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించడం ఏబీడీ(ABD)కి వెన్నతో పెట్టిన విద్య. గ్రౌండ్ నలుమూలలా షాట్లు బాదుతూ చూస్తుండగానే మ్యాచ్‌ను ప్రత్యర్థుల నుంచి గుంజేసుకోవడం అతడి స్టైల్. సంప్రదాయ ఆటకు భిన్నంగా క్రీజులో డ్యాన్స్ చేస్తున్నాడా అన్నట్లు అతని బ్యాటింగ్ Batting తీరు ఉంటుంది. ఇప్పుడు ఆయన స్టైల్‌లోనే చాలా మంది ఆటగాళ్లు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. రిటైర్ అయి చాలా ఏళ్లే గడుస్తున్నా అతడిని మరిచిపోవడం లేదు.
AB Devilliers | అదరగొట్టేశాడు..
భారత అభిమానులు కూడా అతడిపై ఇంకా ప్రేమను కురిపిస్తున్నారు. ఏబీడీ కూడా వాళ్లతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. మరోమారు తాను ఎందుకు గ్రేటో నిరూపించాడు. విదేశీ స్టార్లు భారత్‌కు వచ్చినప్పుడు జూనియర్ లెవల్ ఆటగాళ్లతో కలసి ఆడుతూ, ప్రఖ్యాత క్లబ్స్‌ను సందర్శిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
అయితే ఏబీ డివిలియర్స్ AB Devilliers అందరికీ భిన్నంగా వీల్‌చైర్ టీమ్(Wheelchair Team)తో కలసి ఆడాడు. ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్ కోసం భారత్‌లో ల్యాండ్ అయిన డివిలియర్స్.. ముంబైలోని ఓ వీల్‌చైర్ టీమ్‌తో కలిసి కాసేపు క్రికెట్ ఆడడం అందరిని ఆకట్టుకుంది.. వీల్‌చైర్‌లో ఆడినా ఆటతీరు మారలేదు. కూర్చొని భారీ సిక్సులు బాదాడు. కుర్చీని వేగంగా తోస్తూ పరుగులు కూడా తీశాడు.
కీపర్ మీద నుంచి స్కూప్ షాట్లు బాదుతూ వారెవ్వా అనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ఎక్కడ ఆడినా సరే.. ఏబీడీ చేతికి బ్యాట్ ఇస్తే ఇలాగే రెచ్చిపోతాడని అంటున్నారు. కాగా, ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ Eliminator మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా సందడి చేశాడు డివిలియర్స్.
మనం కోరుకుంటున్న సమయం వచ్చింది. ఆర్సీబీ అనుకున్నట్లుగా దూసుకెళ్తోంది. బెంగళూరు స్టైల్‌లో చెప్పాలని ఉంది (ఈసాలా కప్ నమదే అని ఏబీడీ ఫీలింగ్) కానీ.. అలా ఎప్పటికీ చెప్పొద్దని విరాట్ కోహ్లీ నాతో అన్నాడు. అందుకే ఆ మాట చెప్పలేకపోతున్నా. కానీ నేను బలంగా నమ్ముతున్నా. మనం అనుకున్నది ఈ సీజన్‌లో సాధించబోతున్నాం” అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.