ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | హార్ధిక్- గిల్ మ‌ధ్య కోల్డ్ వార్.. అంత పొగ‌రెందుకు అంటున్న ఫ్యాన్స్

    IPL 2025 | హార్ధిక్- గిల్ మ‌ధ్య కోల్డ్ వార్.. అంత పొగ‌రెందుకు అంటున్న ఫ్యాన్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | గ‌త రాత్రి జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) 20 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్‌(Gujrath)పై విజ‌యం సాధించి క్వాలిఫ‌య‌ర్ 2 ఆడేందుకు సిద్ధ‌మైంది. అయితే గెలిచే మ్యాచ్‌లో గుజ‌రాత్ చేసిన కొన్ని త‌ప్పిదాల వ‌ల‌న ఓడిపోవ‌ల్సి వ‌చ్చింది. అయితే మే 30, 2025న ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో, ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్), శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) టాస్ స‌మ‌యంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోక‌పోవ‌డం చ‌ర్చ‌కి దారి తీసింది.

    IPL 2025 | ఏం జరిగింది..

    సాధార‌ణంగా టాస్ సమ‌యంలో ఏ కెప్టెన్స్ అయిన షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కాని ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ కరచాలనం చేసుకునేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసి చూడనట్లు వ్యవహరించారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ న‌డుస్తుంది. టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ముందుకు వెళ్లగా, శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అటువైపు చూడకుండా వెనుదిరిగాడని, హార్దిక్ కరచాలనం కోసం చేయి అందించినా గిల్ గమనించలేదని కొందరు అభిమానులు వీడియో క్లిప్‌లతో సహా షేర్ చేశారు.

    వీరిద్దరి మధ్య కనిపించిన సంఘటనను “కోల్డ్ ఎక్స్ఛేంజ్” (Cold Exchange)గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఛేజింగ్ టైమ్ లో గిల్ మొదటి ఓవర్లోనే ఔట్ కాగానే గిల్ పక్కకు వచ్చి పెద్దగా అరుస్తూ ఏదో అన్నాడు పాండ్యా. గిల్ కూడా సీరియస్ గా చూశాడు. ఈ సీజన్ అంతా అద్భుతంగా ఆడి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకూ టేబుల్ టాపర్ గా కూడా ఉన్నా.. గుజరాత్ టైటాన్స్ అనూహ్యంగా ఎలిమినేటర్ లో (Eliminator) ఓడి ఎలిమినేట్ అయిపోయింది.

    అయితే గతంలో గుజరాత్ టైటాన్స్ జట్టులో కలిసి ఆడి, జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇలాంటి వాతావరణం నెలకొనడం అభిమానుల‌ని కొంత ఇబ్బంది పెడుతుంది. దీనిని “ఈగో క్లాష్”గా అభివర్ణిస్తుండగా, మరికొందరు కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఉండే ఒత్తిడి కారణంగా ఇలా జరిగి ఉండొచ్చేమో అంటున్నారు.

    Latest articles

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    More like this