ePaper
More
    HomeసినిమాHeroine Srileela | ఏంటి.. శ్రీలీల‌కి నిశ్చితార్థం జ‌రిగిందా?.. వైర‌ల్ అవుతున్న పిక్స్

    Heroine Srileela | ఏంటి.. శ్రీలీల‌కి నిశ్చితార్థం జ‌రిగిందా?.. వైర‌ల్ అవుతున్న పిక్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Heroine Srileela | అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న విష‌యం తెలిసిందే. పెళ్లి సందడీ సినిమాతో టాలీవుడ్‌కి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ రవితేజకి జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

    దీంతో శ్రీలీలకు(Heroine Sreeleela) వరుస ఆఫర్లు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు.

    Heroine Srileela | అంతా స‌స్పెన్స్..

    బాలీవుడ్‌లోను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం ‘దిలర్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు. కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇక వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీలీల కూడా ఇటీవల ముంబైలోనే ఎక్కువ దర్శనం ఇవ్వ‌డం, కార్తీక్ ఆర్యన్‌ (Karthik Aryan) ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో కూడా శ్రీలీల తళుక్కున మెరవ‌డంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ.. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే స‌డెన్‌గా శ్రీలీల‌కి సంబంధించిన కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

    ఈ ఫొటోల్లో శ్రీలీల పెళ్లికూతురి గెటప్‌లో కనిపించడంతో పాటు, కొందరు ఆమె చెంపలకు పసుపు రాస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనికితోడు “నాకు ఈ రోజు చాలా పెద్దది (బిగ్ డే). పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాను, కమింగ్ సూన్” అంటూ ఆమె రాసుకొచ్చిన క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    శ్రీలీలకు రహస్యంగా నిశ్చితార్థం (Engagement) జరిగిపోయిందా? లేక పెళ్లి చేసుకోబోతోందా? అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇవి నిజమైన వేడుక ఫొటోలు కావని, ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్ లేదా వాణిజ్య ప్రకటనకు సంబంధించినవి అయిఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

    More like this

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...