- Advertisement -
HomeతెలంగాణHarish Rao | స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి.. పీసీసీ అధ్యక్షుడిపై హరీశ్​రావు ఆగ్రహం

Harish Rao | స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి.. పీసీసీ అధ్యక్షుడిపై హరీశ్​రావు ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Harish Rao | పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్ (PCC President Mahesh Kumar Goud)​ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్‌గౌడ్‌ చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

కాళేశ్వరం కమిషన్ నోటీసులు (Kaleshwaram Commission notices) వచ్చిన తర్వాత హైదరాబాద్​ శివారు శామీర్​పేటలోని ఓ ఫామ్ హౌస్​లో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరీశ్​రావు భేటీ అయ్యారని పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ శుక్రవారం ఆరోపించారు. అక్కడి నుంచే కేసీఆర్(KCR)​కు ఫోన్ చేసి మాట్లాడారని పేర్కొన్నారు. కమిషన్ ముందు కేసీఆర్, హరీశ్​ రావు, ఈటల రాజేందర్.. ముగ్గురూ ఒకేలా సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని మహేశ్​గౌడ్​ అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలను హరీశ్​రావు ఖండించారు.

- Advertisement -

Harish Rao | సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక..

తమను సూటిగా ఎదుర్కునే ధైర్యం లేక కాంగ్రెస్​ నాయకులు (Congress Leaders) ఇలా మాట్లాడుతున్నారని హరీశ్​రావు మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. బట్ట కాల్చి మీద వేస్తే అబద్ధాలు నిజాలయిపోవు అని పేర్కొన్నారు. పెళ్లిలు, చావులో కలిసిన సందర్భాలే తప్ప.. ఇతర పార్టీల నేతలను తాను కలవలేదని హరీశ్​రావు(Harishrao) స్పష్టం చేశారు.

తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని, మీలా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధిపొందనని ఎద్దేవా చేశారు. మహేశ్​ గౌడ్ తన​ స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు. అధికారంలోకి రావడంలోకి ఇచ్చిన హామీలను ముందు అమలు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News