ePaper
More
    Homeటెక్నాలజీInfinix GT 30 Pro | బెస్ట్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్‌ నుంచి మరో ఫోన్‌

    Infinix GT 30 Pro | బెస్ట్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్‌ నుంచి మరో ఫోన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Infinix GT 30 Pro | మార్కెట్‌ను చైనా(China)కు చెందిన స్మార్ట్‌ ఫోన్లు ముంచెత్తుతూనే ఉన్నాయి. ఆ దేశానికి చెందిన ఇన్ఫినిక్స్‌(Infinix) మిడ్‌ రేంజ్‌లో మరో మోడల్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేయడానికి రెడీ అయ్యింది.

    ఇన్ఫినిక్స్‌ జీటీ 30 ప్రో పేరుతో వస్తున్న ఈ మోడల్‌ ప్రధానంగా గేమింగ్‌ ఫోకస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ (Gaming focused smart phone). వచ్చేనెల 3వ తేదీన భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానుంది. ధర రూ.26 వేలపైనే ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లో అందుబాటులో ఉండనున్న ఈ మోడల్‌ స్పెసిఫికేషన్స్‌ తెలుసుకుందాం..

    డిస్‌ప్లే :

    6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే. 144Hz రిఫ్రెష్‌ రేట్‌. గరిష్ట బ్రైట్‌నెస్‌ 4,500 నిట్స్‌. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ద్వారా గీతలు, డ్యామేజీల నుంచి రక్షణనిస్తుంది.

    ప్రాసెసర్‌ :

    మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్టిమేట్‌. ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌.

    అంటుటు స్కోర్‌ : 15 లక్షలు. గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌లలో శక్తిమంతంగా పనిచేస్తుంది.

    ఆపరేటింగ్‌ సిస్టం:
    ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఇన్ఫినిక్స్‌ ఎక్స్‌వోఎస్‌ 15.

    కెమెరా:

    వెనక భాగంలో 108 MP ప్రైమరీ సెన్సార్‌ 8 MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌.
    ముందు భాగంలో 13 MP వైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌.

    బ్యాటరీ :

    5500 mAh. 45w వైర్డ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌. 30w వైర్‌లెస్‌ చార్జింగ్‌ సపోర్ట్‌. 10w వైర్డ్‌, 5w వైర్‌లెస్‌ రివర్స్‌ చార్జింగ్‌ సౌకర్యం ఉంది.

    కలర్స్‌ :

    బ్లేడ్‌ వైట్‌, డార్క్‌ ఫ్లేర్‌.

    అదనపు ఫీచర్లు :

    డ్యుయల్‌ కెపాసిటివ్‌ షోల్డర్‌ ట్రిగ్గర్స్‌, 520 Hz రెస్పాన్స్‌ రేట్‌తో గేమింగ్‌లో కచ్చితమైన నియంత్రణ లభిస్తుంది. బీజీఎంఐ(BGMI) వంటి గేమ్‌లకు 120 ఎఫ్‌పీఎస్‌ గేమ్‌ప్లే సపోర్ట్‌. సురక్షిత అన్‌లాకింగ్‌ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింగ్‌ స్కానర్‌.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...