Corona Virus
Corona Virus | క‌లెక్ట‌రేట్‌లో కరోనా క‌ల‌క‌లం.. న‌లుగురు సిబ్బందికి నిర్ధార‌ణ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్:Corona Virus | ఇన్ని రోజులూ శాంతించిన కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి ఇప్పుడు మ‌ళ్లీ వీర‌విహ‌రం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్‌ వైరస్‌ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నాయి. కొత్త కోవిడ్ వేరియంట్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితుల్లో సురక్షితంగా ఉండగానికి బూస్టర్ షాట్స్(Booster Shots) ఎంత ముఖ్యమో నిపుణులు గుర్తు చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో సుమారు వెయ్యి మందికి పాజిటివ్‌గా తేలింది.

Corona Virus | క‌రోనా క‌ల‌క‌లం..

నిన్న 1,828 యాక్టివ్‌ కేసులు ఉండగా.. తాజా కేసులతో కలిపి ఆ సంఖ్య 2,710కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,147 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తర్వాత మహారాష్ట్రలో Maharastra 424 కేసులు, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223, కర్ణాటకలో 148, తమిళనాడులో 148, పశ్చిమ బెంగాల్‌లో 116 కేసులు నమోదైనట్లు వివరించింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణ(Telangana)లో 3 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఇక ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా కేంద్రంలో మహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్‌(Eluru Collectorate)లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో కలెక్టరేట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో Isolation ఉండి చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌లోని ఇతర ఉద్యోగులు, సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.కాగా, నాలుగు రోజుల క్రితం ఏలూరు నగరంలోని శాంతినగర్‌కు చెందిన ఇద్దరు వృద్ధులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజా కేసులతో జిల్లాలో కొంత ఆందోళన నెలకొంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.