ePaper
More
    HomeతెలంగాణMulugu | పోలీసులకు చిక్కిన మహిళా మావోయిస్టు

    Mulugu | పోలీసులకు చిక్కిన మహిళా మావోయిస్టు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Mulugu | ములుగు జిల్లాలో ఓ మహిళా మావోయిస్ట్​ పోలీసులకు చిక్కింది. తెలంగాణ– ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని కర్రెగుట్ట(Karregutta)ల్లో ఇటీవల భద్రతా బలగాలు ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) నిర్వహించిన విషయం తెలిసిందే.

    కర్రెగుట్టల్లో దాదాపు వెయ్యి మంది నక్సల్స్​ ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్​ చేపట్టారు. వేల సంఖ్యలో బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. కర్రెగుట్టల్లో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టు చిట్టి అనే మహిళ తప్పించుకుంది. గుత్తికోయగూడెంలో తలదాచుకొని బంధువుల ఇంట్లో రహస్యంగా చికిత్స పొందుతోంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు(Police) గుత్తికోయగూడెంలోకి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గూడెంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారేమోననే అనుమానంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...