అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Disciplinary Committee | కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా డిసిప్లినరీ కమిటీలో నిజామాబాద్ అర్బన్ (Nizamabad Urban) నుంచి డాక్టర్ జీవీ రామకృష్ణ (G.V. Ramakrishna) సభ్యుడిగా నియమితులయ్యారు.
ఉమ్మడి జిల్లా నుంచి డిసిప్లినరీ కమిటీలో రామకృష్ణకు మాత్రమే అవకాశం దక్కింది. ఆయన న్యాయవాద విద్యలో పీహెచ్డీ చేశారు. 1990లో ఎస్ఎస్యూ NSUI డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ సెక్రెటరీగా, ఎన్ఎస్యూఐ నిజామాబాద్ టౌన్ ప్రసిడెంట్‌గా, స్టేట్ జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. 2015లో టీపీసీసీ కార్యదర్శిగా, జూమ్ zoom కాంగ్రెస్ క్యాడర్ ట్రైనింగ్ కమిటీ మెంబర్‌గా, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ టీపీసీసీ మెంబర్‌గా, స్ట్రాటజీ మేనిఫెస్టో కమిటీ మెంబర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా పొలిటికల్ డిసిప్లినరీ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.