అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పాములు హల్చల్ చేస్తున్నాయి. సీతారాంనగర్ కాలనీలో (Sitaramnagar Colony) పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
శుక్రవారం సాయంత్రం ఓ ఇంట్లోకి పాము వచ్చింది. వెంటనే ఇంటి యజమాని మిర్చికాంపౌండ్కు (Mirchi compound) చెందిన పాములు పట్టే ఇమ్రాన్‌కు సమాచారం ఇచ్చారు. అతడు క్షణాల్లోనే అక్కడికి వచ్చి పామును పట్టుకున్నాడు.
వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగానే ఉంటుందని.. తనకు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి వస్తానని ఈ సందర్భంగా ఇమ్రాన్ పేర్కొన్నారు. అయితే నగరంలోని పలు ప్రాంతాల్లోని ఓపెన్స్థలాల్లో మురికి నీరు చేరి పాములు, విష పురుగులకు అవాసాలుగా మారుతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికినీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో.. పాములు బయటకు రావడం సహజం. ముఖ్యంగా ఖాళీ స్థలాలు, శివారు కాలనీల్లో ఉండేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.