More
    HomeతెలంగాణIndiramma Amrutham | ఫ్రీ న్యూట్రీషన్​ ఫుడ్​.. ఇందిరమ్మ అమృతం ఎవరి కోసమంటే..

    Indiramma Amrutham | ఫ్రీ న్యూట్రీషన్​ ఫుడ్​.. ఇందిరమ్మ అమృతం ఎవరి కోసమంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్:Indiramma Amrutham |  తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లోపం(Iron deficiency), రక్తహీనత enemia సమస్యలు లేకుండా ఉండేందుకు మరో వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ఉచితంగా న్యూట్రిషన్ ఫుడ్ అందించేందుకు కసరత్తు మొదలు పెట్టింది.

    రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న యువతులు ఐరన్, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు మిల్లెట్ పట్టీలు(Millet patties), పల్లి పట్టీలు(Palli patties) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు 15 ప్యాకెట్ల చొప్పున రెండు రకాలను ప్రతి టీనేజ్ అమ్మాయికి అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేయనుంది. వీటికి ‘ఇందిరమ్మ అమృతం’ (Indiramma Amrutham)అనే పేరును పరిశీలిస్తోంది.

    ఫ్రీ న్యూట్రీషన్​ ఫుడ్(Free Nutrition Food)​కు ఇందిరమ్మ అమృతం పేరు పెట్టాలనే అంశంపై త్వరలో సీఎం రేవంత్​ నిర్ణయం తీసుకోనున్నారు. ఫ్రీ న్యూట్రీషన్​ ఫుడ్ పంపిణీకి తొలి దశలో ఫైలట్ ప్రాజెక్టుగా కొత్తగూడెం kottagudem, అసిఫాబాద్ asifabad, ములుగు mulugu జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ముందుగా ఈ జిల్లాల్లోని టీనేజ్ అమ్మాయిలను అంగన్ వాడీ టీచర్, ఆయాలు గుర్తిస్తారు. వారిని కేంద్రాలకు పిలిచి న్యూట్రీషన్​ ఫుడ్ పంపిణీ చేస్తారు. దీనికితోడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొవాలనే దానిపై కూడా అవగాహన కల్పించాలని సర్కారు యోచిస్తోంది.

    Indiramma Amrutham | జూన్ నుంచి పంపిణీ

    ఇప్పటికే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను(Contractors ఎంపిక చేశారు. జూన్ నుంచి పంపిణీ చేసేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో అన్ని జిల్లాలకు ఇందిరమ్మ అమృతం పథకం విస్తరించనున్నారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్ వాడీ కేంద్రాల్లో(Anganwadi Centers) ఇప్పటికే బియ్యం, పప్పు, 200 మిల్లీ లీటర్ల పాలు, నెలకు 30 గుడ్లు అందిస్తున్నారు. టీనేజీలో అమ్మాయిల(Teenage Girls) ఆరోగ్యం మెరుగుపర్చితే.. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నియంత్రించవచ్చనేది సర్కారు ఆలోచన.

    More like this

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...