అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jeedimetla | ఆశ మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. అత్యాశ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది.
ప్రస్తుత రోజుల్లో ప్రజలు తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలని కలలు కంటున్నారు. వీరినే లక్ష్యంగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) నుంచి మొదలు పెడితే మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) కంపెనీలు, ఇతర నకిలీ కంపెనీలు పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు.
నిత్యం ఇలాంటి మోసాలు జరుగుతున్నా.. ఇంకా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా స్టాక్‌మార్కెట్ (Stock Market)లో పెట్టుబడుల (Investment) పేరిట ఓ సంస్థ మోసానికి పాల్పడింది. పలువురు అమాయకులను ఏకంగా రూ.150 కోట్ల మోసగించింది. ఈ ఘటన రాష్ట్రంలో చర్చకు దారితీసింది.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ (Jeedimetla Police Station) పరిధిలోని చింతల్ గణేశ్‌నగర్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ (The Penguin Securities) పేరుతో ఓ సంస్థ వెలిసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. వీరి మాయ మాటలు నమ్మి దాదాపు 1,500 మంది రూ.150 కోట్ల మేర ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్ చేసిన వారికి నమ్మకం కలిగించేలా వారికి బాండ్లు కూడా అందజేశారు.
తీరా ఈ మధ్య కార్యకలాపాలు ఆపేశారు. ఎవరితో టచ్ లో లేకుండా సంస్థ యాజమాన్యం ఉదయించింది. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.