ePaper
More
    HomeజాతీయంTeachers Protest | కోల్‌కతాలో పెద్ద ఎత్తున టీచర్ల ఆందోళన

    Teachers Protest | కోల్‌కతాలో పెద్ద ఎత్తున టీచర్ల ఆందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teachers Protest | పశ్చిమ బెంగాల్(West Bengal)​ టీచర్లు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో 2016లో చేపట్టిన ఉపాధ్యాయ నియామాకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు(Supreme Court) ఆ నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. దీంతో మమతా బెనర్జీ(Mamata benarjee) ప్రభుత్వం దాదాపు 26 వేల మంది టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్​ జారీ చేసింది.

    ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో వారు గురువారం బెంగాల్​లో పర్యటించిన ప్రధాని మోదీ(PM Modi)ని కలవడానికి కూడా ప్రయత్నించారు. అలాగే సీఎం మమతా బెనర్జీ ఇంటికి వెళ్లిన పలువురిని సైతం పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం వారి ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీసింది.

    Teachers Protest | ఉద్రిక్తతకు దారి తీసిన ఆందోళన

    సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి క్యాష్-ఫర్-జాబ్స్ స్కామ్‌లో 2016 ప్యానెల్‌ను రద్దు చేసిన తర్వాత ఖాళీగా ఉన్న 24,203 టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అదనంగా మరో 20 వేల కొత్త పోస్టులు కూడా ఉన్నాయి. అయితే తమకు న్యాయం చేయాలని ఉద్యోగాలు పోయిన వారు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సీల్దా మెట్రో స్టేషన్ (silda metro stataion)​ను నిరసనకారులు ముట్టడించడానికి యత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    Teachers Protest | భారీగా పోలీసుల మొహరింపు

    టీచర్ల ఆందోళనతో దాదాపు 840 మంది కానిస్టేబుళ్లు, 25 RAF బెటాలియన్లు, 12 మంది ఇన్​స్పెటక్టర్లు, 60 మంది సబ్-ఇన్స్పెక్టర్లు వాటర్ ఫిరంగులు, టియర్ గ్యాస్ షెల్స్ తో సీల్దా స్టేషన్ ప్రాంగణంలో మొహరించారు. నిరసనకారులు హౌరాలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకోకుండా అడ్డుకున్నారు. పలువురు టీచర్లను అరెస్ట్​ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this