- Advertisement -
HomeతెలంగాణMinister Ponguleti | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అప్పుడే..

Minister Ponguleti | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అప్పుడే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల (Telangana Indiramma houses) పంపిణీ ప్రక్రియ శ‌ర‌వేగంగా సాగుతున్న విష‌యం తెలిసిందే.

చాలా చోట్ల ముగ్గుపోయటం కూడా పూర్తయ్యింది. కొన్ని చోట్ల అయితే శ్లాబులు వేసే వరకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ (second phase of beneficiaries) కూడా పూర్తి కావొచ్చినట్లు స‌మాచారం అందుతుంది. అయితే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) మంజూరులో భాగంగా ఇప్పటికే చాలా గ్రామాల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. అయితే వీరిలో చాలా మందికి ఇంకా ప్రోసిడింగ్స్ కాపీలు అందలేదు. అలానే చాలా చోట్ల ఇందిరమ్మ ఇళ్లకు వయోపరిమితిని లింక్ చేన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

Minister Ponguleti | ఆల‌స్యం లేదు..

ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (State Revenue Minister Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి (Indiramma House Scheme) వయో పరిమితి ఉందా అనే వార్తలపై ఆయన స్పందిస్తూ.. లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదని.. అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

చాలా చోట్ల వయోపరిమితి కారణంగా.. దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు అధికారులు వయోపరిమితిని సాకుగా చెప్పి.. దరఖాస్తులను (applications) పక్కనపెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి వీటిపై స్పందిస్తూ.. ఇందిరమ్మ ఇళ్లు పొందే అంశంలో లబ్ధిదారులకు ఎలాంటి వయో పరిమితి లేదని స్పష్టం చేశారు.

మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 2.10 ల‌క్ష‌ల మందికి ఇందిర‌మ్మ ఇళ్ళ జాబితా సిద్ధం చేసిన‌ట్టు తెలిపారు. వ‌చ్చే నెల పద‌వ తేదీ లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధం అవుతుంద‌ని పొంగులేటి అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌లో 42 వేల ఇళ్లు మంజూరు కాగా, 24 వేల ఇళ్లు ప్రారంభం అయ్యాయ‌ని తెలిపారు. అలానే వంద ఇళ్లు గృహ ప్ర‌వేశానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలియ‌జేశారు.

ఇందిరమ్మ ఇళ్ల (Indiramma house) నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిధుల విడుదలలో ఆలస్యం చేయడం లేదు. ఇంటి నిర్మాణ పనులు ఏమేరకు పూర్తయ్యాయో గమనిస్తూ.. దానికి సంబంధించినంత వరకు ప్రతి సోమ‌వారం గృహ నిర్మాణ శాఖ ద్వారా నిధులను అందిస్తోంది. ఈ మొత్తాన్ని.. మ‌ధ్యవ‌ర్తుల ప్రమేయం లేకుండా 4 విడ‌త‌ల్లో.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News